బుమ్రా బౌలింగ్ యాక్షన్‌పై పాక్ సెలెక్టర్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. బుమ్రా యాక్షన్ తరహాలోనే ఉస్మాన్ తారిక్ యాక్షన్ కూడా ఉంటుందని వారు పేర్కొన్నారు. ప్రపంచ మేటి బౌలర్‌గా ఎదిగిన బుమ్రాను, వివాదాస్పద రీతిలో బౌలింగ్ చేసే తారిక్‌తో పోల్చడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోలిక అర్థరహితమని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.