AP: కృష్ణా జిల్లా రామానాయుడుపేటలో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న వేళ.. వైసీపీ నేత పేర్నినాని ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, పేర్నినాని జెండా దిమ్మ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పేర్నినాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.