కృష్ణా: మచిలీపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం పేర్ని నాని, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, రెండు రోజులుగా రామనాయుడుపేటలో జనసేన జెండా దిమ్మె వివాదం కొనసాగుతోంది. జనసేన పార్టీ జెండా నిర్మాణాన్ని వైసీపీ నేత బొర్రా విఠల్ అడ్డుకోగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.