TG: రైతులకు పెట్టుబడి, ఎరువులు ఇస్తున్నామని తుమ్మల తెలిపారు. తాను మంత్రిగా వచ్చాక ఆయిల్ పామ్ టన్ను రూ.12 వేలు ఉండేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయిల్ పామ్ టన్ను ధర రూ.20 వేలకు పైగా పెంచామని తెలిపారు. తన తోటలో అనేక పంటలు పండిస్తున్నామని చెప్పారు. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయండని సూచించారు.