NRPT: భారత ప్రభుత్వ టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులైన అడ్వకేట్ పసుల నీరజ్‌ను శనివారం నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో ఈ పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లంకాల డిప్యూటీ సర్పంచ్ విజయ్, వెంకటేశ్వర రెడ్డి, బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు.