PPM: కురుపాం మండల కేంద్రంలో ఇవాళ స్దానిక ASI ఏవీ రమణ ఆద్వర్యంలో ITDA పెట్రోల్ బంక్ సమీపంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వాహనానికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేసి పలు వాహనదారులకు ఫైన్లు విధించారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన చోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలు నడిపేవారు విధిగా డ్రైవింగ్ లైసెన్స్, RC ఉండాలన్నారు.