SKLM: పొందూరు పట్టణంలో టీడీపీ నూతన కార్యాలయాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇవాళ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకలాపాలు మరింత బలోపేతం కావడానికి కార్యాలయం ముఖ్య కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.