ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు పామూరు మండలం వెంకటాపురం గ్రామంలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో ఛైర్మన్ ఉప్పలపాటి హరిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి దళారులకు పంటను అమ్మి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కందులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.