GNTR: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి, వినియోగించిన మరో ఏడుగురిని ఇవాళ నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు సౌత్ DSP భానోదయ తెలిపారు. ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చిన సుబ్బారావు, అతనికి సహకరించినవారిని పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఐదుగురిపై ఇప్పటికే హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయని చెప్పారు. గంజాయి అమ్మే, కొనే, సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.