GNTR: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన పాపాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు అని ఎమ్మెల్యే నసీర్ ఆరోపించారు. శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘కల్తీ మద్యం స్కామ్, బాబాయి హత్య, తల్లి, చెల్లిని బయటకు నెట్టేసిన వ్యక్తి జగన్ మొహన్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే జగన్ ప్రజల్లో కన్నా.. జైల్లో ఉంటేనే హ్యాపీగా ఉంటారు’ అని పేర్కొన్నారు.