GNTR: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కోడూరులో రూ. 91.18 లక్షల నిధులతో శనివారం పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులతోపాటు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.