KMM: సత్తుపల్లి వన్యప్రాణుల అక్రమ వేట కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రం సింగ్ తెలిపారు. నిరంతర నిఘా, ప్రత్యేక బృందాల సమన్వయంతో ప్రధాన నిందితులైన మెచ్చ రాఘు, కుంజా భారత్‌లను పట్టుకున్నట్లు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించమన్నారు.