TG: యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 4.50 లక్షల ఇళ్లు పేదలకు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే, లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించిందే ఇందిరమ్మ ప్రభుత్వం అని పేర్కొన్నారు.