KDP: గోపవరం మండలం మడకలవారిపల్లె సమీప జాతీయ రహదారి (నేషనల్ హైవే)పై వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ఆర్డీవో ఏ. చంద్రమోహన్ శనివారం పరిశీలన చేశారు. ప్రమాదకర మలుపులు, లైటింగ్ లోపాలు వంటి అంశాలను సమీక్షించిన ఆయన, తక్షణమే భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ, డివైడర్ మరమ్మత్తులు, హెచ్చరిక బోర్డులు, మరియు స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.