NZB: ఎడపల్లి మండలం నెహ్రూ నగర్లోని రేషన్ దుకాణాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సన్న బియ్యం సజావుగా పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల సభ్యుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం నిల్వలు కేటాయించబడ్డాయా లేదా అని ఆరా తీశారు.