AP: శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్కు దేవుడన్నా, ఏడుకొండల వారి భక్తుల మనోభావాలు అన్నా లెక్కలేదని దుయ్యబట్టారు. బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన జగన్, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం ఘోరమన్నారు.