ప్రకాశం: కనిగిరిలోని సుందరయ్య భవన్లో శనివారం ఎస్ఎఫ్ఐ 47వ జిల్లా మహాసభ జిల్లా అధ్యక్షులు కె. ఆరోన్ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలన్నారు.