ATP: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.7,800 కోట్లు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, విద్యార్థులు ఉన్నత ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.