దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో హిట్మ్యాన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ మరో 27 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 20 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. భారత్ తరఫున ఇప్పటివరకు సచిన్ (34,357), కోహ్లీ (27,808), ద్రవిడ్ (24,064) మాత్రమే ఈ ఘనత సాధించారు.