SKLM: మండలం తండేవలసలో ఉన్న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి శనివారం సందర్శించారు. ఈ మేరకు శిక్షణ కేంద్రంలో ఇప్పటివరకు చేపట్టిన పూర్తి స్థాయి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. శిక్షణలో ఉపయోగించే పరికరాలు, వస్తు సామాగ్రి తదితర అంశాలపై ఆరా తీశారు. శిక్షణ కేంద్రం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.