MDK: రామాయంపేటలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై స్వర్ణకార సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి నెమలి శ్రీనివాస్ చారి నేతృత్వంలో స్వర్ణకార సంఘం సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అధ్యక్షుడు కిష్టాపురం రామకృష్ణ చారి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ చారి తదితరులు మండల తహసీల్దార్ రజని కుమారికి మెమోరాండం అందజేశారు.