ADB: రాష్ట్ర బీజేపీ నాయకులంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు పొగుడుతున్నారనే విషయంపై బీజేపీలో జరుగుతున్న అంతర్గత చర్చనే తాను లేవనెత్తానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు.