AP: విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని సీఎం నివాసం ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో ధర్నా చౌక్‌లో దీక్ష చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.