TG: కేటీఆర్ ఉన్నంతకాలం BRS పార్టీని ప్రజలు బండకేసి కొడతానే ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ పగబట్టి, పట్టుబట్టి SLBCని పడావు పెట్టారు. SLBC ఆగిందని మామ, అల్లుడు డ్యాన్సులు చేస్తున్నారు. ఎవరు అడ్డంపడ్డా SLBCని పూర్తి చేసి తీరుతాం. దేవరకొండకు నీళ్లు పారినట్లు.. నిధులు పారిస్తాం. మంత్రులను పంపుతా.. మీ సమస్యలు పరిష్కరిస్తా’ అని వెల్లడించారు.