దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో, కుల్దీప్ యాదవ్ స్పిన్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడు. అతను 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో, వన్డేలలో భారత్ తరఫున అత్యధిక సార్లు 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే (10 సార్లు)ను అధిగమించి కుల్దీప్ (11 సార్లు) 3వ స్థానానికి చేరుకున్నాడు. షమీ(16), అగర్కార్(12) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.