AP: శాంతిభద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటంపై రైతులు, ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. అభివృద్ధిని చూసి కొందరు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.