MBNR: ఐతోల్ గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బచ్చలకూర ఊర్మిళ బాలస్వామి పోటీ చేశారు. డిగ్రీ పూర్తి చేసిన ఆమె, తన సర్పంచ్ జీతాన్ని విద్యార్థుల భవిష్యత్తు, గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, మహిళా సాధికారతే లక్ష్యంగా వినియోగిస్తానని తెలిపారు. జనాభిప్రాయాన్ని గౌరవిస్తూ గ్రామానికి నిస్వార్థంగా సేవ చేస్తానని ఆమె పేర్కొన్నారు.