కృష్ణా: అవనిగడ్డ(మం) తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న కే. నాగమల్లెశ్వరరావు డిప్యూటి కలెక్టర్‌గా పదోన్నతి పొంది పోలవరం ప్రాజెక్ట్‌కి వెళ్తున్నారు. ఈ సందర్భంగా, అవనిగడ్డ తహసీల్దారు వారి కార్యాలయంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. సదరు సభలో అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొని వారికి సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు.