ప్రకాశం: జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు, కంభం మండలంలోని తురిమెళ్ళలో గల OHSR ట్యాంక్ మరియు మదారుపల్లిలోని GLSR ట్యాంకులను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. సేఫ్ వాటర్ మంత్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంపీడీవో వీరభద్రాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.