NZB: బాల్కొండ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ శనివారం తెలిపారు. 5, 10వ తరగతుల పాఠశాల విద్యార్థులు ఈ నెల 30 తేదీ వరకు అవకాశం ఉందని చెప్పారు. కుల, ఆదాయ, బ్యాంకు ఖాతా పత్రాలతో ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.