AP: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆలయాల పరిరక్షణ, ప్రక్షాళనకు నడుంబిగించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని చెప్పారు. రాబోయే ప్రధాన ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.