ఇండిగో సంక్షోభం దృష్ట్యా ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేశీయ విమాన సర్వీసుల ఛార్జీలను నిర్ణయించింది. 500 కిలోమీటర్ల వరకు విమాన ఛార్జి గరిష్టంగా రూ.7,500గా ఉండాలని తెలిపింది. 500 కి.మీ. నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు రూ.12 వేలు, 1000 కి.మీ. నుంచి 1500 కి.మీ వరకు రూ.15 వేలు, 1500 కి.మీ. దాటితే విమానాల్లో రూ.18,000గా ఉండాలని కేంద్రం ఆదేశించింది.