TG: ఒకప్పుడు కేసీఆర్ ఎంతో ఘనంగా బతికారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేబినెట్ మంత్రులను కూడా గేట్ దగ్గర నుంచే వెనక్కి పంపారు. ఇప్పుడు సర్పంచ్లు, వార్డ్ మెంబర్లను పిలిచి మాట్లాడుతున్నారు. మంచిరోజులు వస్తాయంటున్నారు.. పదేళ్లు దోపిడీ చాలలేదా? అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బండకేసి కొట్టిన విషయం గుర్తు లేదా? కేసీఆర్.. మీ కొడుకే మీకు పెద్ద గుదిబండ’ అని ఎద్దేవా చేశారు.