MDK: ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఎఫ్ఎస్టీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. మండల డిప్యూటీ ఎమ్మార్వో నవీన్‌కుమార్ ఏఎస్సై కృష్ణయ్య పర్యవేక్షణలో వాహనాల సోదాలు నిర్వహించారు. అదే గ్రామంలోని మానెగల రామకృష్ణయ్య ఆయుర్వేద వైద్యశాల పరిసరాలలో కూడా ప్రత్యేక తనిఖీలు చేశారు. మందు, డబ్బు రవాణా వంటి చర్యలను సహించేది లేదన్నారు.