»Believed The Words Of The Pastor 201 People Died At Kenya
Cult deaths: పాస్టర్ మాటలు నమ్మారు..201 మంది పైలోకాలకు చేరారు
కెన్యాలో డూమ్స్‌డే కల్ట్‌తో మరణించిన వారి సంఖ్య శనివారం 201కి చేరుకుంది. పోలీసులు మరో 22 మృతదేహాలను వెలికితీసిన తర్వాత, వారిలో ఎక్కువ మంది ఆకలి కారణంగా మరణించారని పేర్కొన్నారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.
ఓ చోట మృతదేహాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అందేటని ఆరా తీస్తే వారంతా ఆకలితో అలమటించి మరణించినట్లు తెలిసింది. అది కూడా ఓ చర్చిలో చేసిన నిరహార దీక్ష కారణంగా 201 మందికిపై మృతి చెందారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన గత నెలలో వెలుగులోకి వచ్చింది.
గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్ దాని అనుచరులను ఈ దురగాతానికి 2019లో పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్‌లో నలుగురు వ్యక్తులు చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత క్రమంగా మృతుల సంఖ్య 179 నుంచి 201కి చేరింది. మరోవైపు ఇంకా 400 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ క్రమంలో అధికారులు ఆరా తీయగా.. ఈ తీవ్రమైన చర్యలకు నాయకుడు పాస్టర్ పాల్ మెకెంజీ న్థెంగేగా గుర్తించారు.
2019లో పిల్లలను షకహోలా అడవి ప్రాంతంలో శుద్ధి చేయమని మెకెంజీ వారిని వేడుకున్నందున, అతని సంరక్షణలో ఉన్న ఒక జంట ఆకలితో వారి ఇద్దరు అబ్బాయిలను అలా చేసి మోక్షం పొందినట్లు ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే ఇలా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. చాలా మంది ఆహారం తినక, గొంతు నులమడం, ఆయుధాలతో దాడి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు కనుగొన్నారు.
మరోవైపు కిలిఫీ తీర ప్రాంతంలో ఉన్న మెకెంజీ 800 ఎకరాల ఆస్తిలో డజన్ల కొద్దీ సామూహిక సమాధుల నుంచి వందలాది మృతదేహాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో మెకంజీ భార్య సహా 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది మిస్సయినట్లు కోస్ట్ రీజియన్ కమిషనర్ వెల్లడించారు. అంతేకాదు.. అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను విడిపించారు. వీరంతా నడవలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం.
గతంలో మెకంజీ చర్చిలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు అడవిలోకి మకాం మార్చాడని తెలుస్తోంది. అతడి అనుచరులు కూడా అడవిలోకి వెళుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.