TG: 2009లో TDPతో కలిసి BRS పోటీ చేయలేదా? అని మాజీ MLA జగ్గారెడ్డి నిలదీశారు. ‘తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకుంటే తప్పా. సీఎంలుగా చంద్రబాబు, కేసీఆర్ కలిసి మాట్లాడినప్పుడు ఎందుకు తప్పుపట్టలేదు. రాజకీయ లబ్ధికోసం ఆంధ్ర, తెలంగాణకు మళ్లీ కుంపటి పెడుతున్నారు. జగన్, కేసీఆర్ కలిసి మాట్లాడినప్పుడు జల దోపిడీ గుర్తు రాలేదా?’ అని ప్రశ్నించారు.