W.G. మొగల్తూరు మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. స్వచ్ఛతే ఆరోగ్యానికి మూలం అన్న భావనతో.. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దడమే మా సంకల్పమని తెలిపారు.