MNCL: విద్యార్థులు చదువుపై ఆసక్తిని పెంచుకోవాలని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ సూచించారు. బుధవారం అక్కపెల్లిగూడా ప్రభుత్వ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుతోనే అందరికీ భవిష్యత్తు ఉంటుందని ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, తదితరులు పాల్గొన్నారు.