MBNR: సంక్రాంతి పండుగ వేళ 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఎస్పీ డీ. జానకి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాలానగర్ మండల కేంద్రంలోని అండర్ పాస్ వద్ద పెండింగ్లో ఉన్న బీటీ రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.