MNCL: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ అఖిల్ సమావేశం నిర్వహించారు. నమోదైన ప్రతి ఒక్క కేసులో నిందితులు కోర్టుకు హాజరు అయ్యే విధంగా సమన్లను జారీ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు తప్పించుకోవడానికి లేకుండా చూడాలన్నారు. కోర్టుకు హాజరు కాని వారిపై ఎన్బీడబ్ల్యూలను తీసుకుని తగు చర్యలను చేపట్టాలన్నారు.