జనగామ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడిన తీరుతో కేటీఆర్ తన రాజకీయ స్థాయిని తానే దిగజార్చుకున్నారన్నారు. పదేళ్లలో ప్రజలను మోసం చేసిన మీకు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన కేటీఆర్‌పై మండిపడ్డారు.