ASR: పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కొయ్యూరు అటవీ సెక్షన్ అధికారి శ్రీరాములు అన్నారు. కాకరపాడు బీట్ పరిధి నాగాపురంలో బుధవారం బీట్ అధికారి పీవీ రమణ, కాకరపాడు బీట్ అధికారి చిట్టిబాబు, అసిస్టెంట్ బీట్ అధికారి షణ్ముఖ్‌తో కలిసి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రజలు అడవులకు వెళ్లి నిప్పు పెట్టవద్దని సూచించారు.