MDCL: మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ “బస్తీ బాట” కార్యక్రమంలో భాగంగా TGSPDCL డీఈ అన్వర్ భాషతో కలిసి బలరాం నగర్ డివిజన్ పరిధిలోని కృపా కాంప్లెక్స్, ఓల్డ్ నేరెడీమేట్, భగత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. పెండింగ్ విద్యుత్ సమస్యలను పరిశీలించి, పాడైన స్తంభాల మార్పు, వంగిన స్తంభాల రీప్లేస్, రోడ్డు మధ్య పోల్స్ షిఫ్ట్ చేయాలన్నారు.