ATP: ఎల్లనూరు మండలంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మండల వైద్యాధికారి లోకేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెన్నపూసపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, వ్యాక్సినేషన్ పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.