HNK: రాబోయే అన్ని ఎన్నికల్లో BRS పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్, నేతలు నేడు మాజీ ఎంపీతో భేటీ అయ్యారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని మాజీ ఎంపీ పిలుపునిచ్చారు.