కంటి ముందు ఇష్టమైన ఫుడ్ ఉంటే చాలు.. కొందరు కడుపు నిండా లాగించేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదని, కడుపు కనీసం 25 శాతం ఖాళీగా ఉండేలా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా లేదంటే అరుగుదల, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయని.. పొట్ట పెరిగే సమస్య కూడా పెరుగుతుందంటున్నారు. ఆహారం ఆకలి తీర్చుకోవడానికే తినాలని సూచిస్తున్నారు.