‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కేవలం ‘పుష్ప-2, OG, గేమ్ ఛేంజర్, అఖండ-2’ చిత్రాలకే పరిమితమని కోర్టు పేర్కొంది. టికెట్ ధరల పెంపుపై నిర్మాతలు చేసుకున్న విజ్ఞప్తిని పరిశీలించి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తాజా ఉత్తర్వులతో టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.