AP: ఉన్నతాధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారు. తన అధ్యక్షతన ఇవాళ ఉదయం జరిగిన SIPB సమావేశంలో మాట్లాడుతూ.. ‘2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పనిచేశారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చింది. దీంతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి’ అని అన్నారు. ఇకపై కూడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.