NLG: దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కార్మిక విభాగం నూతన అధ్యక్షునిగా మాకం చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా పున్న భిక్షమయ్యను ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరి పదవి కాలం రెండు సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు.