KMR: అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చందూర్ సర్పంచ్ మద్దూరి మాధవ రెడ్డి పేర్కొన్నారు.14 వ వార్డులో గల సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలకు సెన్సార్లు బిగించి, నూతన బల్బులు ఏర్పాటు చేయించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో గ్రామాన్ని ముందుంచుతానన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయిలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.